మద్యం మత్తులో గొడవపడి తండ్రిని కన్న కొడుకు హ*త్య చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చాయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ తన కొడుకు షేక్ సాతక్ అతని స్నేహితుడు రాజు తో కలిసి ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద మంగళవారం రాత్రి మద్యం సేవించి మద్యం మత్తులు లో తండ్రి కొడుకు గొడవ పడడంతో మధ్యం మత్తులో కొడుకు షేక్ సాతక్ బండ రాయి తో తండ్రిని దారుణంగా కొట్టి హ*త్య చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొడుకు తో పాటు స్నేహితుడు రాజు ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హ*త్య గల కారణాలు తెలియరాలేదు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
- Advertisement -
