Wednesday, February 11, 2026
Homeఆజ్ కీ బాత్Aaj ki baat | పోలీసుల నిస్వార్థ సేవకు నిలువెత్తు వందనం

Aaj ki baat | పోలీసుల నిస్వార్థ సేవకు నిలువెత్తు వందనం

రాత్రనక, పగలనక కాలం మారినా మారక, మీ కనులు మెలకువ, మీ అడుగులు పదిలం. ఈ శాంతి (Peace) రక్షకులు-ప్రజల రక్షణీ పీఠం. మీరున్నారు కాబట్టి మా ఊపిరి స్వేచ్ఛా (Freedom) పయనం. ప్రతి ఆపదలో, కష్టాల కడలిలో, ముందు నిలిచే ధైర్యం(Courage), పోలీసన్న మీదే మీ గళం భరోసా, మీ రూపం అభయం, “భయపడకండి. మేమున్నాం.” అని ప్రకటించే దీక్ష. పండుగైనా, పబ్బమైనా, లోకానికి సెలవైనా మీ విధికి లేదు విరామం, నిత్యం జాగరణే, కుటుంబ (Family)సంతోషాలు , ఆత్మీయ అనుబంధాలు, త్యాగం చేసి నిలుస్తారు. సమాజమే (Society) మీ ఇల్లు, ఎండకు ఎండి, వానకు తడిసి, చలిలో గడ్డకట్టి, మీ చెమట చుక్కే ఈ నేలకు భద్రత పత్రం, శాంతిభద్రతల(Law and Order)కై, ఓవర్‌నైట్ డ్యూటీల సాక్షిగా, మీ నిస్వార్థ సేవకు, నిలువెత్తు వందనం ఇది. ప్రతి కార్యక్రమానికీ మీ ప్లానే విజయం(Victory). ప్రతి కదలికకు మీరే వెన్నుదన్నుగా, కీలకంగా, ‘ప్రజల క్షేమమే మా క్షేమం’ అని పలికే నిబద్ధత, మీ త్యాగం అమూల్యం, అద్భుతం, అజరామరం!

  • సారం జితేందర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News