జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ (BJP) అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ విజయవంతంగా ముగిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(RamachanderRao), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (KishanReddy) ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం వెంకటగిరి హైలం కాలనీలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచందర్ రావు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం హైలంకాలనీ నుంచి నామినేషన్ (Nomination) ర్యాలీ ఘనంగా ఆరంభమైంది. డప్పు నృత్యాలతో ఉత్సాహభరితంగా సాగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపక్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. నామినేషన్ దాఖలు అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధికి ఓటు వేయబోతున్నారని, దీపక్ రెడ్డి విజయం తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.

