Friday, October 3, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్Dussehra | ఎపిలో దసరా సెలవులు ప్రకటన

Dussehra | ఎపిలో దసరా సెలవులు ప్రకటన

24 నుంచి 2 వరకు స్కూళ్లకు సెలవులు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతి పెద్ద పండగ కావడంతో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల కోసం స్కూల్‌ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. వారే కాదు ఉద్యోగులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్‌ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు స్కూల్‌ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. ఇటు తెలంగాణలోనూ ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అధికారికంగా మొత్తం 13 రోజులపాటు పండగ సెలవులిచ్చారు. వచ్చే నెల 4న స్కూల్స్‌ తిరిగి ప్రారంభం కానున్నాయి. పెద్ద మొత్తంలో సెలవులు ఉండటంతో హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News