Homeతెలంగాణరికార్డు స్థాయిలో మహిళల ఉచిత ప్రయాణం

రికార్డు స్థాయిలో మహిళల ఉచిత ప్రయాణం

ఆడబిడ్డలకు సిఎం శుభాకాంక్షలు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మీ స్కీమ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసింది. 18 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా సాగుతోన్న మహాలక్ష్మీ స్కీమ్‌ అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ స్కీములో భాగంగా ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మహాలక్ష్మీ స్కీమ్‌ ఈ అరుదైన ఘనత అందుకోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. 18 నెలల ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి సీఎం రేవంత్‌ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News