Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్76 ఏళ్ల గ‌ణ‌తంత్రం…

76 ఏళ్ల గ‌ణ‌తంత్రం…

మన రాజ్యాంగం(Constitution)75 ఏళ్లుగా మనకు తోడు నీడగా ఉంటూ భరత జాతికి, ప్రజాస్వామ్యానికి రక్షణ గోడగా నిలిచింది. ఎన్నో సంక్షోభాలు ఎదురైనా ప్రతిసారి తన మూలాల సాయంతో మరింత బలపడుతోనేవుంది.. రాజ్యాంగానికి వైఫల్య అనేది లేదు, దాన్ని అమలు చేసే పాలకులదే వైఫల్యం. ప్రజలే ప్రభువులుగా ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. రాజకీయపార్టీ (నాయకు)లు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి పాలనలో రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నాయి. వ్యక్తఆరాధన,నియంతృత్వం పెరిగిపోతోంది. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్‌ ప్రతి ఓటుకు సమాన విలువను ఇచ్చారు. కానీ ఆర్థిక, సామాజిక సమానతను నేటికీ మనవాళ్ల పాలనలో సాధించ లేదు. ఆ వైఫల్యాన్ని రాజ్యాంగంపై నెట్టడం మంచిది కాదు. ఆ సేతు హిమాచలం ఒక్కటై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.. లేదంటే? మళ్లీ నియంతృత్వంలోకి పోతాం సుమా!

RELATED ARTICLES
- Advertisment -

Latest News