Friday, October 3, 2025
ePaper
HomeUncategorizedకోడలిని సజీవ దహనం చేసిన అత్త మామలు...రాజస్థాన్ లో దారుణం

కోడలిని సజీవ దహనం చేసిన అత్త మామలు…రాజస్థాన్ లో దారుణం

పిల్లలు పుట్టట్లేదనే కారణం తో ఒక వివాహిత ను అతి దారుణంగా అత్త మామలే చంపేసిన సంఘటన రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతం లో చోటు చేసుకుంది.

హత్య ను ప్రమాదంగా చిత్రీకరించడానికి అత్త మామలు మృతురాలి మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేసి , ఆమె అగ్ని ప్రమాదం లో చనిపోయిందని ఊర్లో వాళ్ళని నమ్మించారు. అయితే ఊర్లో వాళ్ళకి అనుమానం వచ్చి దహన సంస్కారాలు జరిగే ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి అత్త మామలకు ఫోన్ చేసి దహన సంస్కారాలు చెయ్యొద్దని అని చెప్పారు. ఐన కానీ అత్త మామలు హడావిడిగా సరళ మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అక్కడికి సరైన సమయానికి చేరుకొని సగం కాలిన శరీరాన్ని స్వాధీనం చేసుకుని డీగ్ హాస్పిటల్ మార్చురీ లో ఉంచారు.

రౌనిజా గ్రామానికి చెందిన సరళ 2005 లో కాక్రా గ్రామానికి చెందిన అశోక్ ని వివాహం చేసుకుంది. వారికి పిల్లలు లేరు. ఈ కారణం వల్ల అశోక్ ఆమె ను తరుచుగా వేధించేవాడని, కొట్టేవాడని హాస్పిటల్ కి చేరుకున్న ఆమె సోదరుడు విక్రాంత్ ఆరోపించాడు. సరళ మరణ వార్త తెలుసుకుని సరళ కుటుంబ సభ్యులు డీగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె భర్త అశోక్ మరియు అతని కుటుంబమే సరళ ను హత్య చేసారని ఆరోపించారు. సరళ ని తన భర్త తరుచుగా వేధించేవాడని, చాలా సార్లు ఈ విషయం పై పంచాయితీ జరిగింది అన, ఐన కానీ అశోక్ తన తీరు ను మార్చుకోలేదని అన్నారు. తమకు చెప్పకుండానే సరళ దహన సంస్కారాలు చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ విషయం పై దర్యాప్తు కొనసాగుతుంది. అశోక్ కుటుంబానికి కఠిన శిక్ష విధించాలని సరళ కుటుంబం వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News