Thursday, February 19, 2026
Homeఅంతర్జాతీయంYoon Suk Yeol | దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు..

Yoon Suk Yeol | దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు..

  • దేశంలో మార్షియల్ లా విధించేందుకు ప్రయత్నం చేసిన యోన్ సుక్ యోల్..

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడు యోన్ సుక్ యోల్‌ కు జీవిత‌కాల జైలుశిక్ష విధించారు. దేశంలో మార్షియ‌ల్ లా విధించే ప్ర‌య‌త్నం చేసిన కేసులో ఆయ‌న‌కు ఆ శిక్ష‌ను ఖ‌రారు చేశారు. సైనిక బ‌ల‌గాల‌తో జాతీయ అసెంబ్లీని ముట్ట‌డి చేసి, రాజ‌కీయ‌వేత్త‌ల అరెస్టుల‌కు ఆదేశాలు ఇచ్చారు. 2024 డిసెంబ‌ర్ 3న జ‌రిగిన ఆ ఘ‌ట‌న కేసులో మాజీ అధ్య‌క్షుడు యోన్ సుక్ యోల్ కేసు ఎదుర్కొంటున్నారు. సియోల్ సెంట్ర‌ల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జ‌డ్జీ జీ గ్వా యోన్ తుది తీర్పు వినిపించారు.

యోన్ సుక్ యోల్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ప్రాసిక్యూట‌ర్లు కోరారు. యోన్ మ‌ద్ద‌తుదారులు సియోల్ కోర్టు ముందు భారీగా చేరుకున్నారు. తీర్పు అనంత‌రం అనేక మంది కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. యోన్ మాత్రం ఎటువంటి ప‌శ్చాతాపాన్ని వ్య‌క్తం చేయ‌లేదు. ఆధారాలు లేకుండానే తీర్పును ఇచ్చిన‌ట్లు ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది ఆరోపించారు. ముందుగా రాసిన స్క్రిప్టునే జ‌డ్జీ చ‌దివిన‌ట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News