Thursday, February 12, 2026
Homeఖమ్మంGummadi Narasaiah | బయోపిక్ షూటింగ్ అట్టహాసంగా ప్రారంభం

Gummadi Narasaiah | బయోపిక్ షూటింగ్ అట్టహాసంగా ప్రారంభం

సీపీఐ నాయకుడు(Cpi Leader), పేదల పక్షపాతి, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే (Former MLA from Yellandu) గుమ్మడి నర్సయ్య జీవిత కథ(Life Story)ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ బయోపిక్‌(Biopic)కి పరమేశ్వర్ (Parameshwar) హివ్రాలే దర్శకత్వం (Direction) వహిస్తున్నారు. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పాల్వంచలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో కన్నడ హీరో (Kannada Hero) శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ప్రధాన (గుమ్మడి నర్సయ్య) పాత్ర పోషిస్తున్నారు.

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్.సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు(Producer N.SureshReddy). ఈ వేడుకలో మూవీ యూనిట్‌తోపాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని స్క్రిప్ట్ అందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News