యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి కంట్రోల్ పి టెక్నో సొల్యూషన్ ప్రైవేట్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు రెండు హ్యాండ్ హెల్డ్ టికెట్ ప్రింటింగ్ క్యూఆర్ కోడ్ వ్యాలిడేషన్ లు కలిగిన పరికరాలను భక్తుల సౌలభ్యం కొరకు దేవస్థానానికి విరాళంగా ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో వెంకట్రావు లకు అందజేశారు. సుమారు ఒక్కొక్కటి 50వేల విలువ కలిగిన రెండు పరికరాలను దేవస్థానానికి అందజేశామని టీవీఎస్వి టెక్నికల్ హెడ్, సరోజ్ కుమార్ సాహు తెలిపారు.
ఈ రెండు పరికరములు ఒకటి రూ.150/- దర్శనముల టికెట్ స్కాన్ చేయుటకు, మరొకటి రూ.300/-ల బ్రేక్ దర్శన టికెట్ స్కానింగ్ నిమిత్తం వినియోగించబడతాయని, ఈ ఆధునిక పరికరాల వినియోగం ద్వారా దేవస్థానంలో టికెట్ల ధృవీకరణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారి, భక్తులకు వేగవంతమైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని ఆలయ ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు, నవీన్ తదితరులు పాల్గొన్నారు
