- టెండర్ల అన్నింటికీ ఒకే గడువు ఉండదా?
- ప్రొక్యూర్ మెంట్ టెండర్ ప్రకటన ఒక్కటే కానీ తేదీలు వేరు ఇదేమి చోద్యం?
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అధికారులు ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉంది.ఇటీవల సివిల్,ఎలక్ట్రికల్, విభాగానికి యాదగిరిగుట్ట దేవస్థానం వారిచే ఈ ప్రొక్యూర్ మెంట్ షార్ట్ టెండర్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 23 రకాల విభాగాలకు ఆన్లైన్ దరఖాస్తులు దేవస్థానం ఆహ్వానించింది.బిడ్డు సమర్పించుటకు చివరి తేదీ డిసెంబర్ 1 అని,టెక్నికల్ బిడ్డు తెరచు సమయం 2వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు అని తాటికాయంత అక్షరాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

కానీ గడువు మించిపోయినప్పటికీ టెండర్ నిర్వహించక అధికారులు గడువును పొడిగిస్తూ వస్తున్నారు.ఔత్సాహితుల వ్యక్తిగత ప్రయోజనాలకు అధికారులు గడువును పొడిగిస్తున్నారని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై టెండర్లను నిర్వహించకుండా అడ్డుపడుతున్నారని పట్టణంలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఎలక్ట్రికల్ విభాగానికి డిసెంబర్ 4 నాడు ముగిసిందని,సివిల్ విభాగానికి డిసెంబర్ 8 వరకు గడువు ఉందని సంబంధిత అధికారులే రెండు రకాలుగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది.

నిజానికి తేదీలు పెంచినట్లయితే ప్రోత్సాహితులకు అధికారులు సమాచారం ఇవ్వాల్సింది ఉండగా నేటికీ ఇవ్వకపోవడంపై అనుమానాలకు దారితీస్తున్నాయి.ఒకసారి టెండర్ ప్రకటన విడుదలయితే ఏది ఏమైనా చివరి తేదీ తప్పనిసరిగా పాటించాల్సిందే.కానీ అధికారులు తీరు అనుమానాలకు దారితీస్తున్నాయి.టెండరు ప్రకటన విడుదలపై,ముగింపు తేదీలపై సదరు అధికారి ఈఈ దయాకర్ రెడ్డిని వివరణ కోరగా నిబంధనల మేరకే పొడిగించామని,గతంలో కూడా పదిసార్లు తేదీలను పొడిగించడం జరిగిందని ఆయన అన్నారు.
మరి అలాంటప్పుడు దేవస్థానం విడుదల చేసిన టెండర్ ప్రకటనకు విలువ లేదా?ఉంటే అధికారులు పాటించనవసరం లేదా? అనే అనుమానాలు అనేకంగా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రొక్యూర్ మెంట్ షార్ట్ టెండర్ ప్రకటన మరోసారి విడుదల చేసి భక్తులలో ఉన్న అనుమానాలను పోగొట్టవలసిన బాధ్యత అధికారుల పైన ఎంతైనా ఉంది.
