పిఎంజె జ్యువెల్స్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్
ప్రపంచంలోనే అతిపెద్ద బ్రైడల్ & హాఫ్ – సారీ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ప్రదర్శనను పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు నగరంలోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో నిర్వహించారు. ప్రత్యేకమైన బ్రైడల్ కలెక్షన్స్‌తో పాటు సంప్రదాయ, ఆధునిక శైలుల సమ్మేళనంగా రూపొందించిన హాఫ్‌సారీ జ్యువెల్లరీ డిజైన్స్‌ను విస్తృతంగా ప్రదర్శించారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి వధూవరులు, జ్యువెల్లరీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఆభరణాలను వీక్షించారు. పిఎంజే జ్యువెల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. భారతీయ పెళ్లి సంస్కృతిలో ఆభరణాలు కీలక భాగం. వినూత్న డిజైన్స్‌తో ప్రతి వధువు ప్రత్యేకంగా కనిపించేలా మా కొత్త కలెక్షన్స్‌ను తీసుకువచ్చాం అని తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రీమియం డైమండ్ సెట్‌లు, కస్టమ్ డిజైన్ హారాలు, సాంప్రదాయ ముత్యాల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శనలో ఎంపిక చేసుకోవడానికి 20,000కు పైగా డిజైన్‌లు, ఇవన్నీ ఒకే వేదిక మీద బ్రైడల్, హాఫ్ – సారీ ఆభరణాల అతిపెద్ద క్యూరేషన్. హెరిటేజ్ టెంపుల్ మోటిఫ్‌లు, పోల్కీ సెట్‌ల నుండి మొదలు ఆధునిక డైమండ్ సూట్‌లు, రత్నాల వరకు కలెక్షన్, వివాహాలు, నిశ్చితార్థాలు, హాఫ్ – సారీ పండుగ దుస్తుల కోసం రూపొందించినవి ఉంచారు.


