Tuesday, March 3, 2026
HomeరాజకీయంVB–G RAM G | బీజేపీ ఆఫీసులో వర్క్‌షాప్

VB–G RAM G | బీజేపీ ఆఫీసులో వర్క్‌షాప్

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆఫీసులో VB–G RAM G పథకంపై నిర్వహించిన వర్క్‌షాప్‌(WorkShop)లో అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు(Ramchander Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత ఉపాధి పథకాల్లోని లోపాలు(Errors), లీకేజీలకు(Leakages) చెక్ పెట్టేందుకు కొత్త చట్టాన్ని రూపొందించారని చెప్పారు. సాంకేతికత(Technology) ఆధారంగా రూపొందిన కొత్త చట్టం.. పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణకు కొత్త దిశ చూపుతుందని తెలిపారు. వికసిత్ భారత్(Viksit Bharat)-2047 లక్ష్యానికి అనుగుణంగా సంక్షేమ విధానాలను కూడా ఆధునికీకరించాలని అభిప్రాయపడ్డారు. 125 రోజుల ఉపాధి, 60:40 నిధుల మోడల్, గ్రామసభ ఆధారిత ప్రణాళికలు, బయోమెట్రిక్ GPS–AI పర్యవేక్షణతో కూడిన VB–G RAM G దేశానికి అత్యంత అవసరమైన సంస్కరణ అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News