- కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం.
- ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి..
మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని .. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా సోమవారం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో, పెబ్బేరు పట్టణంలోని సహారా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 75 లక్షల 50 వేల రూపాయల వడ్డీ లేని రుణాలను అదేవిధంగా..
ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన రెండేళ్ల కాలంలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. నాడు గత పాలకుల హాయంలో పంపిణీ చేసిన చీరలు రైతన్నలు వారి పంట వద్ద అడవి పందులు, జింకలు రాకుండా కట్టే వారనీ..నేడు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు ప్రతి మహిళ తన అన్న తమకు పంపిన చీర సరేగా భావిస్తున్నారని తెలిపారు.
ఏదైనా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిితేే నిరుపేద కుటుంబాలు ఆసుపత్రికి వెళితే 5 లక్షలు ప్రమాద బీమా ఉండేదని .. నేడు ప్రజా ప్రభుత్వంలో 10 లక్షల బీమా పెంచామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు స్థాపించి గ్రామాల్లోని మహిళలకు పాఠశాలల నుండి ప్రత్యేక గుర్తింపును తెచ్చిందన్నారు. వేసవి సెలవుల్లో పాఠశాలను ప్రారంభం కాకముందే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను ముందస్తుగానే పాఠశాలలకు చేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.
ఈ సందర్భంగా వారు వనపర్తి లోని మహిళ స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, పెబ్బేరు మున్సిపాలిటీలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15 లక్షల 50 వేల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల అందజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్, వనపర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
