ఆసియా కప్ ట్రోఫీ (Asia Cup Trophy), మెడల్స్(Medals) కనిపించకుండా పోవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాటిని అబుదాబి(Abu Dhabi)లోని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నఖ్వీ(Naqvi)యే ఈ పనిచేశాడని చెబుతున్నారు. బీసీసీఐ(Bcci) ఆఫీసర్ ఒకరు రీసెంట్‌గా ఏసీసీ(Acc) ఆఫీసుకు వెళ్లినప్పుడు అవి అక్కడ కనిపించలేదు. అక్కడి స్టాఫ్ వాటిని తీసేశారని, అవి ఇంకా నఖ్వీ స్వాధీనంలోనే ఉన్నాయని అంటున్నారు. గత నెల 28న టోర్నీలో గెలిచిన ఇండియా నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవటానికి ఆసక్తి చూపకపోవటంతో అతను వాటిని తనతోపాటు పట్టుకొనిపోయి ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. తాజాగా అక్కడి నుంచి తప్పించాడు. ఐసీసీ జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యేట్లు లేదు. అయితే.. దీనికన్నాముందు బీసీసీఐ.. ఐసీసీ(Icc)కి ఫిర్యాదు చేయాల్సి ఉంది.
- Advertisment -
