Wednesday, March 4, 2026
Homeవరంగల్‌Tummala | వరంగల్ మార్కెట్‌లో తడిసిన పత్తి సంచులు

Tummala | వరంగల్ మార్కెట్‌లో తడిసిన పత్తి సంచులు

ఈ ఘటనపై విచారణకు మంత్రి తుమ్మల ఆదేశం

రైతులకు ఆర్థిక నష్టం జరగలేదని అధికారుల నివేదిక

- Advertisement -

వరంగల్ వ్యవసాయ మార్కెట్‌(Warangal Agricultural Market)లో నిన్న మంగళవారం భారీ వర్షం వల్ల పత్తి సంచులు తడిచిన ఘటన(Cotton Bags Getting Wet)పై ప్రభుత్వం (Government) స్పందించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwar Rao) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి సూచనలతో రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. 7,329 బస్తాల పత్తిలో 59 బస్తాలు మాత్రమే తడిసినట్లు విచారణలో తేలింది. తడిసిన పత్తిని సిబ్బంది సహాయంతో ఆరబెట్టి అదే రోజున కొనుగోలు చేశారు. రైతులకు ఆర్థిక నష్టం జరగలేదని నివేదికలో పేర్కొన్నారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ రూపొందించిన ఈ నివేదికను మార్కెటింగ్ డైరెక్టర్.. మంత్రి తుమ్మలకి అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News