- ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరిక
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) పై బీఆర్‌ఎస్ (Brs) నాయకులు చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రామగుండం శాసన సభ్యులు (Mla) మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Raj Thakur). ఆదివారం,రామగుండంలోని తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆరోపణలపై తీవ్ర అసహనం:
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఇటీవల మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) సహా ఇతర బీఆర్‌ఎస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు, దూషణలకు దిగుతున్నారని అన్నారు. విమర్శలు రాజకీయాలకు సంబంధించినవిగా ఉండాలి కానీ,వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ఉండకూడదు.పద్ధతి లేని ఈ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం సహించరు అని ఆయన గట్టిగా హెచ్చరించారు.
ప్రజా క్షేమం కోసం కృషి:
మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో,ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో, ప్రజా క్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ నాయకులకు ఆయన సూచించారు.ప్రజా సేవకు అంకితమైన నాయకుడిపై ఇటువంటి నిరాధార ఆరోపణలు మానుకోకపోతే,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన విధంగా బుద్ధి చెప్తారని,తక్షణమే ఈ వ్యక్తిగత దూషణలను ఆపాలి అని రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు,వివిధ విభాగాల అధ్యక్షులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
