Tuesday, October 28, 2025
ePaper
Homeవరంగల్‌COLLECTOR: ఖానాపూర్ కేజీబీవీని తనిఖీ చేసిన వరంగల్ కలెక్టర్

COLLECTOR: ఖానాపూర్ కేజీబీవీని తనిఖీ చేసిన వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భోజన నాణ్యతను పరిశీలించి, కూరల రుచిని విద్యార్థులను తెలుసుకున్నారు. మెనూను ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. కేజీబీవీలో విద్యార్థుల సౌకర్యార్థం కనీస వసతులు కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేసిన తలుపులు, ఇనుప గ్రిల్స్, టాయిలెట్ల మనమ్మత్తు లను, ఆరో ప్లాంట్, కిచెన్ రూఫ్ తదితర పూర్తయిన పనులను కలెక్టర్ పరిశీలించారు.

కోతులు వస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కోతులు రాకుండా వెంటనే మెష్ ఏర్పాటు చేయాలని డీఈ ను ఆదేశించారు. వారంలో ఒకరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డేగా నిర్ణయించి ఆరోజు పిల్లలతో అదే భాష రోజు మొత్తం మాట్లాడిం చాలని, దీనితో వారి వకాబులరీ పెరుగు తుందన్నారు. విద్యా ర్థుల తో ముచ్చటించి వారి పట్టణ సామర్థ్యాన్ని తెలుసుకొని ఇష్ట పడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లో వేయాలన్నారు.

క్రీడల కొరకు వాలీబాల్ బాస్కెట్బాల్, ఖో ఖో కోర్టులు కావాలని విద్యా ర్థులు కలెక్టర్ ను కోరగా, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్, టిఈడబ్ల్యూఐడిసి దీఈ అశోక్, జిఈసిఓ ఫ్లోరెన్స్, ఎంఈఓ శ్రీదేవి స్పెషల్ ఆఫీసర్ మేనక, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News