Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌MLA | గల్లి స్థాయి నుండే ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కి శ్రీకారం.

MLA | గల్లి స్థాయి నుండే ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కి శ్రీకారం.

  • శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి..

ప్రణాళిక బద్ధంగా గల్లి స్థాయి నుండి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి స్పష్టం చేశారు.పుర ఎన్నికల్లో భాగంగా ఆదివారం 22 వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కల్పన సత్యం కు మద్దతుగా మార్నింగ్ వాక్ తో గల్లి గల్లి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కల్పనా సత్యం ను చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ పాలనలో కలెక్టర్, ఎస్పీ బంగ్లా, రోడ్లపై డివైడర్లు కట్టి ..

లైట్లు ఏర్పాటు చేసి, మినీ ట్యాంక్ బండ్ ల పేరుతో చెరువుకు రిబిట్ మెంట్ కట్టి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ అని 30 సంవత్సరాల సమస్యలు డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణం, విద్యుత్ సమస్యలు ప్రతి వార్డులలో పరిష్కరిస్తూ .. ప్రభుత్వం ఇచ్చిన హామీలు సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు భరోసా, బోనస్, 500 కే సిలిండర్ వంటి పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని కొనియాడారు. వార్డు అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారని..

- Advertisement -

వార్డు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృదే వనపర్తి మున్సిపల్ ఎన్నికలో 33 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News