వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి/పెబ్బేరు, జనవరి 30(ఆదాబ్ హైదరాబాద్): పెబ్బేరు మునిసిపాలిటీ(Pebberu Municipality)లో 12 వార్డులకు 12 వార్డులు గెలవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి(Wanaparthy MLA Megha Reddy) అన్నారు. శుక్రవారం పెబ్బేరు ప్రజలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు(Party Change) తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని 4, 6, 9 వార్డుల్లోని బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు తాటికొండ ఆంజనేయులు, మరో 53 మంది ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వనపర్తి నందిహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, పెబ్బేరు మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెబ్బేరు పట్టణ మాజీ అధ్యక్షుడు వెంకట్ రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రంజిత్ కుమార్, సదానందరెడ్డి, శివ, రణధీర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
