Wednesday, February 11, 2026
Homeమహబూబ్‌నగర్‌Home Guards | శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం.

Home Guards | శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం.

  • జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి..

శాంతి భద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో హోంగార్డుల పాత్ర అపూర్వమైనదని జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి పేర్కొన్నారు. శనివారం హోంగార్డ్ 63వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, క్రైమ్‌ నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్‌, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తు అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు చూపే అంకితభావం ప్రశంసనీయం అని కొనియాడారు.

ప్రజల రక్షణ, అంతర్గత భద్రతలో పోలీసుశాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో 1946 డిసెంబర్ 6 న స్వచ్ఛంద సేవా భావంతో ఏర్పాటైనదని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారంలో పోలీసుశాఖ చేస్తున్న కృషికి అదనపు బలం అందించేందుకు శిక్షణ పొందిన హోంగార్డ్స్ పోలీసు వ్యవస్థలో భాగమని, వారి సంక్షేమానికి పోలీసుశాఖ కట్టుబడి, పోలీసు సిబ్బందితో సమానంగా హోంగార్డులకు ప్రయోజనాలను కల్పిస్తుందని తెలిపారు. వనపర్తి జిల్లాలో 137 మంది హోంగార్డులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు బలమైన అండగా నిలుస్తున్నాని, పోలీసు కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని, విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ సిబ్బందిని రివార్డ్స్ ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు.

- Advertisement -

అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డిఎస్పి వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి బాలాజీ నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్, హోంగార్డు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News