Wednesday, March 25, 2026
Homeఆజ్ కీ బాత్Decision | ప్రజాస్వామ్యం తన తీర్పు రాయబోతోంది

Decision | ప్రజాస్వామ్యం తన తీర్పు రాయబోతోంది

బీహార్(Bihar) లో ప్రచార గాలులు ఆగాయి, జూబిలీహిల్స్ లో(JubileeHills) క్యాంపెయినింగ్ వెహికల్స్ ఆగిపోయాయి. ప్రచార యుద్ధం ముగిసింది, మైక్లు మౌనమయ్యాయి. నేతల వాగ్బాణాలు గాలిలో తేలుతున్నాయి, వాగ్దానాల ప్రతిధ్వనులు ఇంకా వినిపిస్తున్నాయి. జెండాలు కిందికిదిగాయి, గల్లీల్లో మాటల వేడి తగ్గింది.ఓటరు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు, ఆలోచనలో మునిగిపోయాడు.

ఎవరు తన మనసు గెలిచారో, ఎవరి మాట తన హృదయాన్ని తాకిందో సమయం చెబుతుంది.పార్టీలు తమ లెక్కల్లో మునిగితేలుతుంటే, ప్రజాస్వామ్యం(democracy) తన తీర్పు రాయబోతోంది. వోటు వేసే వేళ ప్రతి వోటరుకీ ఒక ఆశ, ఒక నిర్ణయం, కావాలన్న ఒక మార్పు. ఫలితాల వేదికపై ఎవరికి కీర్తి కిరీటం, ఎవరికి మౌన శిక్ష చూడాలి. ప్రజాస్వామ్యపు దర్పణంలో నిజం తేలే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి

- Advertisement -
RELATED ARTICLES

Latest News