ఖానాపూర్ ఎమ్మెల్యే(Khanapur Mla), నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు(Nirmal DCC President) వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) బుధవారం భైంసా పట్టణ కేంద్రంలో మునిసిపల్ ఎన్నికల ఆశావాహులతో భేటీ అయ్యారు. టికెట్ ఎవరికీ కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేయ్యాలని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణ రావు పటేల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కౌన్సిలర్ టికెట్ ఆశావాహులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. అత్యధిక స్థానాలను గెలిచి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుందామని పిలుపునిచ్చారు. దీనికోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పారు. టికెట్ రానివారికి పార్టీ ఇతర అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్ అర్జున్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎంబడి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ సాహెడ్ అలీ, జిల్లా ఇన్‌ఛార్జ్ టీపీసీసీ ప్రతినిధి చంద్ర శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Khanapur Mla | భైంసాలో మునిసిపల్ ఆశావహులతో ఎమ్మెల్యే భేటీ
By Aadab Desk
- Advertisement -
Previous article
