దీపావళి(Diwali), జీఎస్టీ(Gst) తగ్గింపు నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) ఆకాశమే హద్దుగా జరిగాయి. యూపీఐ లావాదేవీలు ఆల్ టైమ్ రికార్డు (All Time Record) సృష్టించాయి. NPCI గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో రోజువారీ సగటు లావాదేవీల విలువ రూ.94 వేల కోట్లకు చేరింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ.
ఈ నెల ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే యూపీఐ (UPI) జీవితకాల (Life time) అత్యుత్తమ నెలవారీ ప్రదర్శన నమోదుచేసే దిశగా వెళుతోంది. ఈ నెల 20న దీపావళి ముందు రోజు యూపీఐలో 74 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ నెలలో ఇప్పటికి రోజుకు యావరేజ్‌గా 69.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లోని 65.4 కోట్ల రికార్డును అధిగమించింది.
