- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినేట్..
- భేటీకి హాజరైన రాజ్ నాథ్, అమిత్ షా, వైష్ణవ్ తదితరులు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం నాడు కేంద్ర క్యాబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అశ్విని వైష్ణవ్ తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయం పేరును ‘సేవతీర్ధ’గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రూ.1,60,504 కోట్ల విలువైన పనులను చేపట్టాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది.
అస్సాంలో అండర్ వాటర్ రివర్ టన్నెల్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గోహుపూర్-నుమాలిఘర్ మధ్య అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది. 34 కిలోమీటర్ల మేర అండర్ వాటర్ టన్నెల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ టన్నెల్ నిర్మాణంతో 250 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా 6 గంటల సమయం పట్టే గమ్యస్థానాన్ని కేవలం 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర నది కింద రైల్వేలైన్, నేషనల్ హైవే కోసం టన్నెల్ని నిర్మించనుంది.
అలాగే కసారా-మన్మాడ్ మూడు, నాలుగో రైల్వేలైన్ ప్రాజెక్ట్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ-అంబాల మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బళ్లారి-హోస్పేట మధ్య రూ.2,372 కోట్లతో 3, 4 రైల్వేలైన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది. గూడె బేల్లూరు నుంచి మహబూబ్నగర్ సెక్షన్ మధ్య రూ.3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మహబూబ్నగర్ నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర, హైదరాబాద్కు ఈ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్-పనాజీ కారిడార్లో భాగంగా కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది.
80 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3175 కోట్ల ఖర్చు చేయనుంది. దమాసియా- బిటాడ నర్సాపూర్ మలోత సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,584 కోట్లను ఖర్చు చేయనుంది. గోతి- ట్రిమ్బక్ – పాల్గర్ సెక్షన్ అబ్రిడేషన్ కోసం రూ.3320 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
