Thursday, February 12, 2026
Homeనల్లగొండMunicipal Elections | పొంచి ఉన్న కోవర్టుల ముప్పు

Municipal Elections | పొంచి ఉన్న కోవర్టుల ముప్పు

  • తలనొప్పిగా జంపింగ్ నేతలు

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వద్దే నమ్మకంగా ఉంటూ ఇక్కడి సమాచారం అక్కడ… అక్కడి సమాచారం ఇక్కడ చేస్తున్న కోవర్డులు తలనొప్పిగా మారారు. స్థిరత్వం లేకుండా అభ్యర్ధుల ప్రలోభాలకు లొంగి పార్టీలు ఫిరాయిస్తున్న వారితో పాటు ప్రస్తుతం ఉన్నవారు పార్టీలోనే కొనసాగుతూ ఇక్కడి సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచర గణంతో చర్చించి ఏ వార్డులలో ఎవరెవరిని చేర్చుకోవాలి. ఎవరిని ప్రలోభాలకు గురి చేస్తే తమకు లాభం కలుగుతుంది.

మద్యం, విందుల ఏర్పాటు పలు అంశాలపై చర్చించుకుంటున్నారు. అయితే ఈ చర్చలోనే ఉన్న కోవర్టులు సమయం చూసుకొని తమ ప్రత్యర్థి శిబిరాలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. దీంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్న అభ్యర్థి కంటే ముందుగానే ప్రత్యర్థి శిబిరానికి చెందిన నాయకులు అక్కడికి వెళ్లి అక్కడి వ్యవహారాలను చక్కబెడుతూ వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి పార్టీకి చెందిన నాయకుడిని కలవడానికి వస్తే వెంటనే ఆ సమాచారం నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి శిబిరానికి చేరిపోతుంది.

- Advertisement -

వెంటనే సదరు నాయకులు ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులను సంప్రదించి బుజ్జగించి పార్టీ అడ్డుకుంట సంఘాల వారిని ఫిరాయింపులను న్నారు. కుల ప్రతినిధులు ఇరువర్గాల వారిని కలిసి లాభపడాలని ఆలోచనతో వస్తే ఇలాంటి వారిని సైతం గుర్తించటానికి కోవర్టులు ఉపయోగపడుతున్నారు. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రత్యర్థుల ఎత్తులు, చిత్తులతో యుద్ధాన్ని తలపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News