Thursday, February 12, 2026
Homeఅంతర్జాతీయంImmigration | అక్రమ వసలదారులకు ట్రంప్ మరో ఆఫర్

Immigration | అక్రమ వసలదారులకు ట్రంప్ మరో ఆఫర్

  • స్వచ్చందంగా అమెరికా వీడే వారికి 3వేల డాలర్ల తోఫా..
  • విమాన ప్రయాణం కూడా ఉచితమే

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్‌ యంత్రాంగం.. వారికి గతంలో ప్రకటించిన ఓ ఆఫర్‌ను భారీగా పెంచింది. అమెరికా వీడేందుకు అంగీకరించిన వారికి ఇస్తామన్న స్టైఫండ్‌ను మూడు వేల డాలర్లకు పెంచినట్లు పేర్కొంది. స్వదేశానికి వెళ్లిపోయేం దుకు ఉచితంగా విమాన ప్రయాణ సదుపాయానికి ఇది అదనమని తెలిపింది. ఈ హాలీడే ఆఫర్‌ ఈ ఏడాది చివరి వరకు మాత్రమేనని సోషల్‌ విూడియాలో ఓ ప్రకటన చేసింది. డీహెచ్‌ఎస్‌ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి 19లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడిపోయారని సమాచారం. వీరిలో కొన్ని వేల మంది సీబీపీ హోమ్‌ యాప్‌ను వినియోగించు కున్నట్లు తెలిసింది.

ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే 1.5లక్షల మందిని బహిష్క రించగా.. దాదాపు 13వేల మంది స్వచ్ఛందంగా వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే, ఈ గణాంకాలకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడలేదు. అక్రమ వలసదారులపై కొరడా రaుళిపిస్తున్న ట్రంప్‌ యంత్రాంగం.. వందలాది మందిని అరెస్టు చేస్తోంది. అనంతరం వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛందంగా అమెరికా వీడాలనుకునే వారికి ప్రోత్సాహకంగా వెయ్యి డాలర్లు ఇస్తామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఈ ఏడాది మేలో ప్రకటించింది.

- Advertisement -

ఇందుకోసం కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ హోమ్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. అటువంటి వారిని నిర్బంధించాల్సిన అవసరం లేకుండా చూస్తామని, బలవంతంగా స్వదేశానికి తరలించాల్సిన జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది. అంతేకాదు వారిపై విధించిన జరిమానాలపైనా మినహాయింపు ఇస్తామని చెప్పింది. ప్రభుత్వం అందిస్తోన్న ఈ ప్రత్యేక ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోని అక్రమ వలసదారులకు అరెస్టు, బహిష్కరణ మాత్రమే మార్గమని డీహెచ్‌ఎస్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అటువంటి వారికి అమెరికాకు మళ్లీ తిరిగి వచ్చే అవకాశమే ఉండదని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News