Wednesday, March 4, 2026
Homeమెదక్‌Jagadevpur | ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

Jagadevpur | ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

  • రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
  • అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి
  • టిఎంపిఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాగుల రాజు

రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే బయటికి రావాలని టీఎంపీఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాగుల రాజు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు, వాగులు, వంకలు, నిండి పొంగి పార్లే అవకాశాలు ఉన్నందున సంబంధిత గ్రామాల ప్రజలు ,రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం జిల్లాలో రాబోవు రెండు రోజులలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప ఎవ్వరు బయటకి రాకూడదని సూచించారు. గ్రామాలలో పురాతన ఇండ్లు కూలే ప్రమాదంలో ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కుటుంబ సభ్యులను వాగులు చెరువులు కుంటలను తిలకించేందుకు ఎవరు వెళ్లవద్దని సూచించారు. కురిసే వర్షాల కారణంగా విద్యుత్ స్థంబాలకు విధ్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలే అవకాశం వున్నందున ప్రజలు పిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్థంబాలను కానీ విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా జాగ్రత్తగా వుండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News