- తిరుమల లడ్డూ ధరల పెంపు అబద్దం
- దుష్ప్రచారాలను భక్తులు నమ్మవద్దు
- ధరలు పెంచే ఆలోచన లేదన్న చైర్మన్
- మండిపడ్డ టీటీడీ బిఆర్ నాయుడు
శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అబద్ధాలు ప్రచారం చేయడంపై టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రతో ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం తగదన్నారు. లడ్డూ ప్రసాదం ధరల పెంపు వార్తలు పూర్తి అస త్యాలని, ఆధారాలు లేనివని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనేలేదని ఆయన స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తిరుమల లడ్డూను పెంచేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పంది స్తూ… ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ధరలను పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లడ్డూ ధరల పెంపు వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కావాలనే కొన్ని ఛానళ్లు పని గట్టుకొని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ధరల పెంపు అంటూ నిరాధార వార్తలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. టీటీడీపై కొన్ని ఛానళ్లు బాధ్యతార హితంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. లడ్డూ ధరలను పెంచే ఉద్దేశం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. టీటీడీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిం చారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని నాయుడు పేర్కొన్నారు.
