Saturday, April 4, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD | తిరుమలలో పెరిగిన రద్దీ..

TTD | తిరుమలలో పెరిగిన రద్దీ..

  • శిలాతోరణం వరకు క్యూ లైన్..

కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 68,445 మంది భక్తులు దర్శించుకోగా 31,383 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.79 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. అనంతపురానికి చెందిన వి.ఎస్.రవి కుమార్ టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News