Tuesday, February 10, 2026
Homeమెదక్‌Tiger Paw Prints | తిగుల్ గ్రామంలో పులి పంజా

Tiger Paw Prints | తిగుల్ గ్రామంలో పులి పంజా

  • ఉప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని
  • ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక
  • వ్యవసాయ పోలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దు

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామ శివారులోని వ్యవసాయ పోలాల వద్ద పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలూ భయాందోళన గురయ్యారు .శుక్రవారం కొంతమంది రైతులు ఉదయం తమ పోలాల వద్దకు రైతులు వెళ్లుచుండగా గ్రామ శివారులోని పెద్ద గుండు ప్రాంతంలో పులి పాదాల అడుగులు కనిపించడంతో రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామంలోని ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి పులి తిరిగిన అడుగులను చూసి భయాందోళన గురయ్యారు.

వెంటనే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మల్లేశంతో పాటు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పులి అడుగులను పరిశీలించారు. అనంతరం జిల్లా ఫారెస్ట్ అటవీశాఖ అధికారి పద్మజారాణి సంఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. అలాగే అంతాయిగూడ గ్రామములో కూడా పాదముద్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పాదముద్రలు పరిశీలించి పులి లేదా చిరుతపులా అనేది నిర్ధారిస్తామని చెప్పారు. ఇటీవల జిల్లాలోని రాయపోల్, దౌల్తాబాద్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలిసిన విషయమే. అలాగే ఇటీవల కుకూనూరు పల్లి, తోగుట మండలంలో కూడా పులి సంచరించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ దిశగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

- Advertisement -

అందులో భాగంగానే జగదేవపూర్ మండలంలో కూడా పాదముద్రలను చూస్తుంటే ఇక్కడ కూడా పులి సంచరిస్తుందని తెలుస్తుందని చెప్పారు. ఏదేమైనాప్పటికీ రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. పశువులను కూడా వ్యవసాయ పొలాల్లో కట్టెయ్యకుండా పశువుల కొట్టంలో కట్టేసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లలను ఒంటరిగా వదలకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే రైతులు సాగుచేసిన పంటల రక్షణ కోసం విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే వెంటనే తీసివేయాలని సూచించారు. గ్రామాల్లో పశువులపై దాడులు జరిగినట్లయితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

అలాగే ఆయా గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో దండోరా వేయించాలని కోరారు. పులి సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే రాయ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ శాఖ అధికారులు వినాయక్, షేకావత్, అర్జున్, స్వామి ఆయా గ్రామాల సర్పంచులు పరమేశ్వర్, రజిత మల్లేశం, రజిత, మాజీ సర్పంచ్ లు సుధాకర్ రెడ్డి, భానుప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News