కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (Central, State Governments) ఉద్యోగులకు రెండు కళ్లు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బుధవారం కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కరీంనగర్, సిరిసిల్ల (Sirisilla) జిల్లాల అభివృద్ధి సమన్వయ సమావేశం(Development Coordination Meeting)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇది తన హయాంలో ఏర్పాటుచేసిన రెండో సమావేశమని చెప్పారు. మొదటి మీటింగ్‌లో ఇచ్చిన సలహాలు, సూచనలను కొంత మంది అధికారులు పాటిస్తుండగా మరికొంత మంది పట్టించుకోవట్లేదని తప్పుపట్టారు. ఇది సరికాదని హితవు పలికారు. ఉద్యోగులు నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తేనే డెవలప్‌మెంట్ సాధ్యపడుతుందని తెలిపారు.
- Advertisement -
