Friday, February 27, 2026
Homeమహబూబ్‌నగర్‌NMMS | విద్యార్థుల స్పందన సంతోషకరం

NMMS | విద్యార్థుల స్పందన సంతోషకరం

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్‌లో నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్‌షిప్ (National Means-cum-Merit Scholarship: NMMS) పరీక్షకు విద్యార్థుల నుంచి విశేష స్పందన రావటం సంతోషకరమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే (Mahbubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ (Mahbubnagar First) ఆధ్వర్యంలో, తన సహకారంతో నిర్వహించిన ఈ పరీక్షను 600 మంది రాయటం గర్వకారణమని చెప్పారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, ఉన్నత విద్యకు దారి చూపే ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.

- Advertisement -

పరీక్షలో మెరిట్ సాధించిన 100 మంది విద్యార్థులకు జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి శ్రీలలితాంబికా అమ్మవారి ఆలయంలో 10 రోజులపాటు ప్రత్యేకంగా ఉచిత శిక్షణ తరగతులు (Special free training classes) నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి, వాలంటీర్లతో సమీక్ష నిర్వహించానని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసిన మహబూబ్‌నగర్ ఫస్ట్ కోఆర్డినేటర్ గుండా మనోహర్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, హన్వాడ ఎంఈఓ గోపాల్ నాయక్, ప్రధానోపాధ్యాయులు బాలు యాదవ్, దత్తు రవి, భాస్కర్ రెడ్డి, వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News