Sunday, February 22, 2026
Homeబిజినెస్Railways Goal | 5 ఏళ్లు.. 2.5 ట్రిలియన్లు..

Railways Goal | 5 ఏళ్లు.. 2.5 ట్రిలియన్లు..

రెండో దశ ఆస్తుల నగదీకరణ(monetization)కు సంబంధించి రైల్వే శాఖ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తొలి దశ లక్ష్యాన్ని చేరుకోవటానికే పోరాడుతున్న తరుణంలో కొత్త టార్గెట్ పెట్టుకోవటం గమనార్హం. రైల్వే శాఖ రూపొందించిన సెకండ్ ఫేజ్ మానెటైజేషన్‌ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.. రానున్న ఐదేళ్లలో ఆస్తుల నగదీకరణ ద్వారా రెండున్నర ట్రిలియన్ల నిధులు సమీకరించాలని రైల్వే శాఖ కొత్తగా ప్రణాళిక సిద్ధం చేసింది.

‘నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్ టూ పాయింట్ ఓ’(National Monetization Pipeline2.O)లో భాగంగా ఈ ప్లాన్ రెడీ చేసింది. గతంలో నగదీకరణ ద్వారా ఒకటిన్నర ట్రిలియన్లకు పైగా ఫండ్ రైజ్ (Fundraise) చేయాలనే గోల్ పెట్టుకొని దాన్ని తర్వాత ఒక ట్రిలియన్‌కి తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడు రెండున్నర ట్రిలియన్ల టార్గెట్ పెట్టుకోవటం చెప్పుకోదగ్గ విషయం. అయితే.. ఈసారి ఎక్కువగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌ల(Public Private Partnerships)పై ఆధారపడాలని నిర్ణయించుకుంది.

- Advertisement -

ఇందులో భాగంగా.. గతిశక్తి కార్గో టెర్మినల్స్(Gati Shakti Cargo Terminals), స్టేషన్ రీడెవలప్‌మెంట్, కమర్షియల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టనుంది. ముఖ్యంగా.. కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లోని అత్యధిక విలువ కలిగిన భూములను అభివృద్ధి చేయబోతోంది. దీర్ఘకాలిక ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆకర్షించడంతోపాటు స్థిరమైన ఆదాయ మార్గాలను నిర్ధారించడం ఈ బహుళ-ఆస్తి విధానం ఉద్దేశమని అధికారులు తెలిపారు. గతంలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ ముందుకుపోవాలనే కృతనిశ్చయంతో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News