Wednesday, December 10, 2025
EPAPER
Homeఅంతర్జాతీయంChina | చైనా అధికారుల ఓవరాక్షన్

China | చైనా అధికారుల ఓవరాక్షన్

చైనా అతి మరోసారి బయటపడింది. ఆ దేశ అధికారులు ఓవరాక్షన్ చేశారు. మన దేశ మహిళ(Lady)ను ఇబ్బందిపెట్టారు. ఆమె పాస్‌పోర్ట్‌(Passport)పై అరుణాచల్‌ప్రదేశ్(Arunachalpradesh) అని ఉండటమే అందుకు కారణం. అరుణాచల్‌ప్రదేశ్ చైనాలో భాగమని పేర్కొంటూ ఇమిగ్రేషన్(Immigration) అధికారులు ఎగతాళి చేశారు. ఆమె పాస్‌పోర్ట్ చెల్లదని, చైనా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవాలని చులకన భావనతో సూచించారని బాధితురాలు (Victim) పేర్కొన్నారు.

వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ అనే మహిళ ఈ నెల 21న లండన్ నుంచి జపాన్ వెళుతుండగా మధ్యలో ట్రాన్సిట్ హాల్ట్ (Transit Halt) కోసం చైనాలోని షాంఘైలో దిగినప్పుడు ఈ ఘటన జరిగింది. భారత దౌత్య అధికారుల సహాయంతో ఆమె అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు ప్రధాని మోదీ(PM Modi)కి ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ సంఘటనపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News