అలల (Waves) తాకిడికి భయపడి ఆగిపోతాయా నావలు(Ships)
చీకటి(Dark)ని చూసి వెనకడుగు వేస్తుందా సూర్యకిరణం(Sun Ray)
ఓటమి(Defeat)ని చూసి కుంగిపోతే.. గెలుపు(Victory) దరిచేరుతుందా
రాలిపోయే ఆకు(Leaf) కూడా పాఠం(Lesson) చెబుతుంది
చిన్న చీమ సైతం క్రమశిక్షణను నేర్పుతుంది
పడి లేవడమే కదా సృష్టి ధర్మం
విశ్రమించడం అంటే గమ్యాన్ని విస్మరించడమే
భయాన్ని దహించెయ్
బద్ధకాన్ని తరిమెయ్
ఆశయమే ఆయుధం
శ్రమే విజయానికి వారధి
అవకాశం మళ్లీ మళ్లీ రాదు
శిఖరాగ్రాన నిలిచే వరకు విశ్రమించకు
లోకం నిన్ను చూసి గర్వించేలా చరిత్రను నువ్వే రాసుకో
నింగిని తాకే సంకల్పం నీదైతే
నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావని చింతించకు
అసలు నడవకుండా ఆగిపోయావేమోనని భయపడు
విజయం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు
అది ప్రతి రోజూ మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాల మొత్తం
- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
