ప్రభుత్వ స్థలమా..? ప్రైవేట్ స్థలమా..?
నోటరీ పత్రాలతో జోరుగా ప్లాట్టు అమ్మకాలు..
అనుమతి లేని వెంచర్లో అడ్డగోలు నిర్మాణాలు…
రెండు మండలాల సరిహద్దుని ఆసరాగా చేసుకుని బరితెగించిన వైనం..
అమ్మకం దారుడికి అధికారులు, రాజకీయ నాయకుల సంపూర్ణ సహకారం..
రాజకీయ నాయకుల (Political Leaders) అండ. ప్రభుత్వ అధికారుల (Government Officers) సహకారంతో రెండు మండలాల సరిహద్దుని ఆసరా చేసుకొని ప్రభుత్వ భూమిలో సాగావేసి ప్రైవేట్ భూమి అని కలరింగ్ ఇస్తూ ప్లాట్లుగా విభజించి నోటరీ పత్రాల(Notary Papers)తో అమ్ముతూ కోట్లు గడిస్తున్న బలే కృష్ణుడి మాయ కథ ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే… ఇది గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలోని జగద్గిరిగుట్ట (Jagadgirigutta) ప్రాంతంలో జరుగుతున్న తంతు…
కుత్బుల్లాపూర్, నవంబర్ 5 (ఆదాబ్ హైదరాబాద్): కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి మండలాల సరిహద్దులను ఆసరా చేసుకొని ఓవర్ టాపింగ్ ల్యాండ్ అంటూ గాజులరామారం (GajulaRamaram) సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ సర్వేనెంబర్ 348 లోని 14 ఎకరాల ప్రభుత్వ స్థలంతో పాటు కూకట్ పల్లి మండలంలోని వివిధ వివిధ సర్వే నంబర్లలోని స్థలాన్ని చూపిస్తూ ఏకంగా అనుమతి లేని వెంచర్ (Venture) ఏర్పాటు చేసి 80,160 గజాల ప్లాట్లుగా విభజించి అమ్మకాలకు శ్రీకారం చుట్టారు బిఆర్ఎస్ నాయకుడు. రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సహకారంతో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగిస్తూ కోట్ల విలువ చేస్తే ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు స్థలంగా చూపిస్తూ కైంకర్యం చేస్తుండడం విస్మయానికి గురిచేస్తుంది.

పాత బాలనగర్ మండలంలోకి వస్తుందని బుకాయిస్తున్న సదరు వ్యక్తికి గాజులరామారం సర్కిల్ అధికారులు గ్రీన్ కార్పెట్ వేసి మరి ఆయన అమ్మతాలు చేస్తున్నటువంటి ప్లాట్ లకి అభివృద్ధి పేరుతో భూగర్భడ్రైనేజీ, సిసి రోడ్లు నిర్మాణాలు చేస్తూ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంచడం వెనకాల మతలబు ఏంది? ఆ వ్యక్తి తనది ప్రైవేటు ల్యాండ్ అని చెప్పుకోవడం అనధికారిక లేఅవుట్ ఏర్పాటు చేయడం అందులో ప్రభుత్వ అధికారులు మౌలిక వసతుల పేరుతో అభివృద్ధి పనులు చేపట్టడం చూస్తుంటే అందరి సహకారంతోనే ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపిస్తూ ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టి కోట్లు గడిస్తున్నట్లు తెలుస్తుంది.
గతంలో పలుమార్లు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సైతం సర్వే చేపట్టి స్థలం ఏ మండలానికి వస్తుందో నిర్ధారించకపోవడంతో అదే ఆసరాగా చేసుకొని వరికి చెరువు ఎఫ్ టి ఎజ్ స్థలాన్ని సైతం తనదేనంటూ అమ్మకాలు చేసి నిర్మాణాలు చేపడుతుండడంతో హైడ్రా అదికారులు కూల్చివేతలు చేశారు. గాజుల రామారం సర్కిల్ పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు బస్తీలో నివసిస్తున్న వారికి వేటికీ ఇంటి టాక్స్ అందించకపోవడం శోచనీయం. జానీ ప్రభుత్వ భూమిని (ప్రైవేటు భూమిగా చూపిస్తూ భూదేవి హిల్స్ లో సదరు వ్యక్తి ఏర్పాటు చేసిన అనధికారిక లేఖవుట్ లో నిర్మిస్తున్న నిర్మాణాలకి ఇంటి టాక్స్ లు విధించడంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

సదరు వ్యక్తి చెప్పుకుంటున్నట్లు భూమి ప్రైవేట్ భూమి అయితే నిబంధనలు ప్రకారం ‘హెచ్ఎండిఏ(HMDA) అనుమతితో లేఔట్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ ద్వారా ప్లాట్లు విక్రయాలు చేయాలి కానీ అక్కడ అన్ని నోటరీ పత్రాల తో అమ్మకాలు చేస్తుండడం తోనే అర్ధం చేసుకోవచ్చు అది ప్రైవేటు భూమా ప్రభుత్వ భూమా అనేది. అసలు భూలేని హిల్స్ ఏ మండలం పరిధిలోకి వస్తుంది అనేది సుస్పష్టం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు భూదేవి హిల్స్ ఏ మండలంలోకి వస్తుంది అది ప్రైవేటు భూమా, ప్రభుత్వ భూమా తేల్చాలని అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలోని కొందరి పెద్దల సహకారంతో భూదేవి హిల్స్ పేరుతో ప్రభుత్వ భూమిని వలహారంలా పంచుకు తింటున్న వారి ఆగడాలను ప్రజా ప్రభుత్వం లోనైనా అరికట్టాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని భూదేవి హిల్స్ గుట్టను అక్రమాల పుట్టగా మార్చిన వ్యక్తులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భూదేవిహిల్స్ రెండు మండలాల పరిధిలోకి వస్తుందని, కుత్బుల్లాపూర్ మండలం సర్వే నంబర్ 348 లోని ప్రభుత్వ స్థలం దాదాపు 14 ఎకరాలు వుంది. తమ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రాంతాన్ని సందర్శిస్తున్నారని తమకు పిర్యాదు. అందిన వెంటనే బార్యలుతీసుకోవడం జరుగుతుందని నీటి మల్లికార్జున్ స్పష్టం చేసారు. భూదేవి హిల్స్ లో జరుగుతున్న భూ దందాలో ఎవరి పాత్ర ఎంత? అక్రమాలను సక్రమాలు చేస్తున్న అధికారులు ఎవరు? స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి? మరో కథనం ద్వారా ఆడాజ్ మీ ముందుకు తేనుంది. మా అక్షరం అవినీతిపై పాస్త్రం.
