Wednesday, February 18, 2026
HomeతెలంగాణProtest | పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చెయ్యాలి..

Protest | పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చెయ్యాలి..

టీజీటీ డబ్ల్యు.ఆర్.ఈ.ఐ.ఎస్. పరిధిలో పనిచేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్ల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు ఉద్యోగులు.. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సమితి పరిధిలోని టీజీటీ డబ్ల్యు ఆర్ సీఓఈలు, ఎస్.ఓ.ఈ.లలో 2011 నుంచి సేవలందిస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు తమకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్–2025, జనవరి–2026 నెలల జీతాలు ఇంకా విడుదల కాలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన రెండు నెలల జీతాలను ఫిబ్రవరి నెల జీతం నుండి సర్దుబాటు చేసినప్పటికీ, మిగిలిన నెలల జీతాలు ఇప్పటివరకు జమ కాకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకుల సంస్థల విద్యార్థుల విద్యా ప్రగతికి, ఐఐటీ, ఎన్ ఐ టి, ఐ ఐ ఐ టి, జీ.ఎఫ్.టి.ఐ. మెడికల్ సీట్ల సాధనకు నిరంతరం కృషి చేస్తున్న అధ్యాపకులకు జీతాలు అందకపోవడం వల్ల ఇంటి అద్దె, పిల్లల పాఠశాల/కాలేజీ ఫీజులు, విద్యుత్ బిల్లులు, వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలు వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

జీతాల విడుదలపై స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర ఒత్తిడి పెరిగి, అది పని సామర్థ్యంపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, టి.జీ.టి.డబ్ల్యు.ఆర్.ఈ.ఐ.ఎస్. కార్యదర్శిని సీనియర్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జీతాల విడుదలపై త్వరిత నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల ఆర్థిక ఒత్తిడి తగ్గి, విద్యార్థులకు మరింత సమర్థంగా సేవలందించగలమని వారు తెలిపారు. పెండింగ్ జీతాలను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఈ ప్రకటన ద్వారా మరోసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News