Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణటీజీఎస్ఆర్టీసీ బ‌స్‌పాస్ ఛార్జీల పెంపు

టీజీఎస్ఆర్టీసీ బ‌స్‌పాస్ ఛార్జీల పెంపు

నేటి నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ర‌కాల బ‌స్‌పాస్ ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. ప్ర‌జ‌లు, విద్యార్థుల బ‌స్ పాస్ ధ‌ర‌ల‌ను 20 శాతానికి పైగా పెంచింది. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే (జూన్ 9 సోమవారం) అమ‌ల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా పెంపుతో రూ.1150 ఉన్న ఆర్డిన‌రీ బస్ పాస్ రేటు రూ.1400కు చేరింది. ప్రస్తుతం రూ.1300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధర రూ.1600 అయింది. ఇప్పుడు రూ.1,450గా ఉన్న మెట్రో డీల‌క్స్ బస్ పాస్ కాస్ట్ రూ.1800కు చేరుకుంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధ‌ర‌ల‌ను సైతం పెంచారు. టికెట్ ఛార్జీల‌తోపాటు బ‌స్ పాస్ ధరలను పెంచ‌డంపై ప్యాసింజర్లు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. ముఖ్యంగా పురుష ప్రయాణికులు రేవంత్ ప్ర‌భుత్వంపై మండిపడుతున్నారు. ఒకవైపు మ‌హిళ‌ల‌కు ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పిస్తూ.. మరోవైపు మ‌గవాళ్ల‌పై ఛార్జీల బాదుడు ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News