ప్రముఖ తెలుగు వైద్యుడు (Telugu Doctor) చందోలు నాగమల్లేశ్వరరావు (Chandolu Nagamalleshwar Rao) అరుదైన ఘనత సాధించారు. జమైకా (Jamaica Award) దేశ అత్యున్నత అవార్డుల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ (ఆఫీసర్ ర్యాంక్-ఓడీ) (Order of Distinction) పురస్కారాన్ని (Award) అందుకున్నారు. ఈ అవార్డును జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ (Jamaican Prime Minister Andrew Holness) చేతుల మీదుగా తీసుకున్నారు. డాక్టర్ నాగమల్లేశ్వరరావుది ఏపీలోని గుంటూరు జిల్లా(Guntur District). ఇరవై ఏళ్ల కిందట జమైకా వెళ్లి స్థిరపడ్డారు.

పేదల వైద్యుడి(The doctor of the poor)గా పేరొందారు. ఇంటి పేరు(చందోలు)తో గ్లోబల్ హెల్త్ కేర్ ప్రాక్టీస్ స్థాపించి వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. జమైకాలో అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజు (500 జమైకా డాలర్లు మాత్రమే) తీసుకునే డాక్టర్‌గా ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. అవార్డు పొందిన సందర్భంగా డాక్టర్ నాగమల్లేశ్వరరావును కింగ్‌స్టన్‌లోని మన దేశ రాయబార కార్యాలయం అభినందించింది.
