- తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య..
నిమ్న కులాల వర్గాలకు ఓటు అనే ఆయుధాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య అన్నారు. శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపడానికి అంబేద్కర్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితంలో కష్టాలకు ఓర్చుతూ సమాజంలోని పీడితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల శ్రీను, హోటల్ బలరాం, డ్యారపోగు బాలరాజు, బొట్టు మన్యం, జి కృష్ణయ్య, రాజు మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
