తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) హాల్‌టికెట్ల(Hall Tickets)ను విద్యా శాఖ శనివారం విడుదల చేసింది. వాటిని టెట్ వెబ్‌సైట్(Website) నుంచి డౌన్‌లోడ్(Download) చేసుకోవచ్చని తెలిపింది. టెట్.. 2026 జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో జరుగుతుంది. ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. రెండు పేపర్లకు కలిపి మొత్తం 2 లక్షల 37 వేల మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చేస్తున్నవారు కూడా టెట్ రాయటం తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు ఇచ్చింది. దీంతో ఈసారి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)ల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లతో కలిపి దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేశారు. 2026 ఫిబ్రవరి 10, 16 తేదీల మధ్యలో రిజల్ట్ ఇస్తామని పాఠశాల విద్యా శాఖ గతంలో వెల్లడించింది.
Telangana | టెట్ హాల్ టికెట్ల విడుదల
- Advertisement -
RELATED ARTICLES
