ఇండియా (India) తలసరి ఆదాయంలో తెలంగాణ (Telangana) రాష్ట్రం అగ్ర స్థానం(Top)లో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Rbi) విడుదల చేసిన తాజా హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ (Handbook of Statistics on Indian States) ఈ విషయాన్ని వెల్లడించింది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,87,623 నమోదు చేసింది. కర్ణాటక(Karnataka), తమిళనాడు(Tamilnadu), హర్యానా (Haryana), మహారాష్ట్ర (Maharastra), కేరళ (Kerala) సహా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచింది.
ఇది రాష్ట్ర బలమైన ఆర్థిక వేగాన్ని తెలియజేస్తోంది. డాలర్ పరంగా తెలంగాణ తలసరి ఆదాయం 4,295. ఇది జాతీయ తలసరి ఆదాయం 2,777 కంటే ఎక్కువ కావటం విశేషం. ప్రపంచ బ్యాంకు (World Bank) ఆదాయ వర్గీకరణ ప్రకారం ఇది ఎగువ మధ్యతరగతి అయిన 4,496 డాలర్ల నుంచి 13,935 డాలర్లకి చేరుకునే అంచున ఉంది. తెలంగాణ తర్వాత కర్ణాటక, తమిళనాడు, హర్యానా, మహారాష్ట్ర ఉన్నాయి. కర్ణాటక తలసరి ఆదాయం రూ.3,80,906. తమిళనాడు తలసరి ఆదాయం రూ.3,61,619. హర్యానా తలసరి ఆదాయం రూ.3,53,182. మహారాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,09,340.
