- తెలంగాణ శ్రీనివాస్ నాయక్
తెలంగాణ రాష్ట్ర జాతిపిత నేనే అంటూ దగాపడ్డ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బానోతు శ్రీనివాస్ ( తెలంగాణ శ్రీనివాస్ నాయక్) అన్నారు.. ఎలాంటి ప్రమాణాలు లేకుండా ఎవరికి వారే తెలంగాణ జాతిపిత అనుకోవడం అహంకార నియంతృత్వం స్వ ప్రకటిత, అప్రకటిత కోవలోకి వస్తుందని అన్నారు…
జాతిపిత బిరుదు? బాధ్యత? ఈ తారతమ్యాలు తెలుసుకోవాలి ఆ ప్రాంత భూమి, ప్రజల కోసం వ్యక్తిగత లాభం లేకుండా జీవితాన్ని అర్పించిన వ్యక్తి, ప్రజల ఆకాంక్షను తన శ్వాసగా మార్చుకున్న మహోన్నతమైన వ్యక్తి ఉండాలి స్వయం ఘోషిత బిరుదు కాకుండా ప్రజలు ఇచ్చిన గుర్తింపు అయినప్పుడే నిస్వార్థ బాధ్యత ఉన్నప్పుడే జాతిపితగా కొనియాడ పడతారు… యావత్తు తెలంగాణ ప్రజలే తమకు తామే తెలంగాణ జాతిపితాలుగా భావిస్తారు…
అందులో తప్పులేదు ఎందుకంటే తెలంగాణ ఎవరి దయతోనో వచ్చిన రాష్ట్రం కాదు, ఎవరి రాజకీయలబ్ది ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల రక్తంతో, కన్నీళ్ళతో, పోరాటంతో వచ్చిన రాష్ట్రం.. తెలంగాణలో అనేక మంది నాయకులు ఉన్నారు… అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి అంటూ వారికి నచ్చిన కూతురి, తల్లుల ముఖ కవళికల తో విగ్రహాలు తయారు చేయించి తెలంగాణ తల్లి అనిపించుకోవడం సిగ్గుచేటు..
కానీ తెలంగాణ జాతిపిత అనిపించుకోవాలంటే కనీస ప్రమాణాలు లేవు రాష్ట్ర సాధనలో కెసిఆర్ గారి పాత్ర కీలకమైనప్పటికీ.. భావద్వేగాలే కాకుండా వాస్తవాలు మాట్లాడాలి అంటే కెసిఆర్ గారు నాడు ఆటకెక్కిన తెలంగాణ వాదాన్ని ప్రధాన రాజకీయ ఎజెండాగా మార్చి ఆ మరణ నిరాహార దీక్ష చేపట్టడం అమోఘం, అద్భుతం ఇది తెలిసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేవరకు చూస్తే కెసిఆర్ గారి ఒత్తిడి రాజకీయ వ్యూహాలు అభినందించే విషయం అయినప్పటికీ ముందు వరుసలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గద్దర్ ఇలా ఎంతోమంది నిస్వార్థ పరులు తమ జీవితాలను త్యాగం చేశారు ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది… రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యమకారుల ప్రాధాన్యం తగ్గింది..
ఇది నిజం! కనీస గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం.. ధనార్జీయమే ధ్యేయంగా పెట్టుకుని బ్యూరోక్రసీ, నెపోటిజం, తియోక్రాటిక్ ల వ్యవహరిస్తూ కొన్ని వర్గాల ప్రజలను బానిసలా చూడడం బాధాకరం అందుకే తెలంగాణ జాతిపిత అనిపించుకుని అర్హత ఉండాలి అంటే… రాష్ట్రం కోసం 1200 మంది ఉద్యమకారుల త్యాగం, రైతులు ప్రాణాలు అర్పించింది నీళ్లు,నిధులు, నియామకాలు.. అంతేకానీ రాజకీయ పదవుల కోసం, సంపదల కోసం, కుటుంబాల కోసం కాదు కేవలం తెలంగాణ రాష్ట్రం బతకాలి..!.
ఇలా చూస్తూ పోతే నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనగా ప్రతిపక్షం, అధికారపక్షం, మిత్రపక్షం, వామపక్షం, కుల సంఘాల నాయకులతో, ఆధ్యాత్మికవేత్తలతో, సామాజిక వేత్తలతో ఇలా కెసిఆర్ గారితో సరి సమానంగా ప్రతి ఒక్క రిని కలిసి తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను వివరించి విజ్ఞప్తి చేసి చివరికి నా ప్రాణ త్యాగంతో నైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ఆశతో 2009 సంవత్సరంలో మహబూబాబాద్ లో వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను నాడు ఉమ్మడి రాష్ట్రంలో నాదే మొదటి పోలీసు కేసు..
ఎనిమిది సార్లు జైలుకెళ్ళి 29 కేసులు ఎదుర్కొన్న.. నాకు దక్కింది శూన్యం?? అంటే నేను గిరిజన లంబాడ బిడ్డను ?? నాతోటి ఉద్యమకారుడు అగ్రవర్ణం మా ఊరి అల్లుడు నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యాడు.. నేను నేడు దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుడిగా మిగిలిపోయాను అంటే?. నా త్యాగం, నా నేపథ్యం?. చూస్తే నేను కూడా తెలంగాణ జాతిపితగా అనుకోవడంలో తప్పు లేదని తెలంగాణ శ్రీనివాస్ నాయక్ అన్నారు
