Sunday, February 22, 2026
Homeతెలంగాణఘనంగా తెలంగాణ హోంగార్డుల 63వ రైజింగ్ డే వేడుకలు

ఘనంగా తెలంగాణ హోంగార్డుల 63వ రైజింగ్ డే వేడుకలు

  • రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు (IPS)ఆదేశాల మేరకు నిర్వహించిన రక్తదాన శిబిరం అమోఘం
  • రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి
  • ఇప్పటివరకు 35వ సారిగా నేను చేసిన రక్తదానం
  • రక్తదానం చేయడం వలన ఇతరుల ప్రాణాలను మనం కాపాడవచ్చు
  • నా ప్రాణం ఉన్నంతవరకు నేను రక్తదానం చేస్తూనే ఉంటా నా ప్రయాణమే ప్రజాసేవ
  • ప్రజల కోసం ఎల్లవేళలా పోలీస్ శాఖ తోడుగా ఉంటుంది
  • కసారమోని శ్రీశైలం యాదవ్ హోంగార్డ్

1962లో ఆరంభమైన ప్రజాభద్రత యాత్ర

హైద‌రాబాద్: రాష్ట్ర హోంగార్డ్ దళం 63వ రైజింగ్ డే వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా విశేషంగా నిర్వహించింది. 1962 డిసెంబరు 6న ఏర్పడిన హోంగార్డులు, పోలీసు శాఖకు విశ్వసనీయ సహాయక దళంగా నిలుస్తున్నారు.

ఎక్కడ చూసినా పరేడ్ సందడి

జిల్లా మరియు యూనిట్ కేంద్రాల్లో నిర్వహించిన పరేడ్ కార్యక్రమాలు హోంగార్డ్ సిబ్బంది క్రమశిక్షణను, అంకితభావాన్ని ప్రతిబింబించాయి. ప్రజల రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దళంగా వారు తమ ప్రతిభ ఆవిష్కరించారు.

- Advertisement -

సేవాభావానికి అభినందనలు

హోంగార్డుల సేవలను అధికారులు భేషుగ్గా అభినందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాచకొండ అంబర్పేట్ డిసిపి శ్యామ్, సుందర్
ఏసీపీలు , అడ్మిన్లు, ఆర్ఐ సుభాన్ గౌడ్ , ఆర్ ఐ వెంకటస్వామి హోంగార్డ్ ఆర్ఐ శ్రీనయ్య, హోంగార్డ్ ఆఫీస్ ఆర్ఎస్ఐ వెంకట రాజు, ఏఎస్ఐ రాజా వర్ధన్ ప్రజా భద్రత కోసం వారి కృషి మరువలేనిదని శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News