2035 నాటికి దేశంలో తొలి తలసేమియా రహిత రాష్ట్రం(Thalassemia-Free State)గా తెలంగాణను నిలపటమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ(Damodar Raja Narasimha) చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఆసియన్ తలసేమియా కాన్‌క్లేవ్(Asian Thalassemia Conclave)లో మాట్లాడుతూ.. ఈ లక్ష్య సాధనలో సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్క్రీనింగ్, జన్యు సలహా, అవగాహన ద్వారా తలసేమియా నివారణను సాధించొచ్చని చెప్పారు. ఏ బిడ్డ కూడా నివారించదగిన జన్యుపరమైన రుగ్మతతో జన్మించకూడదని అన్నారు. మిషన్ తలసేమియా-రహిత తెలంగాణ.. హెల్త్ విజన్(Health Vision)-2047లో భాగమని పేర్కొన్నారు.
- ఆసిఫాబాద్, మంచిర్యాల & కరీంనగర్‌లలో 3 కొత్త డే కేర్ సెంటర్లు ఏర్పాటుచేస్తారు.
- 11 లక్షలకు పైగా ప్రజలకు సికిల్ సెల్ వ్యాధి పరీక్షలు చేశారు.
- T-డయాగ్నోస్టిక్స్‌లో ఉచితంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు
- ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు నగదు రహిత చికిత్స
- NIMSలో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి.
- తలసేమియా & సికిల్ సెల్ రోగులకు పెన్షన్
- Advertisement -
