నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పపూర్ అనే మారుమూల గ్రామంలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు (Telangana Bjp Chief) ఎన్.రామచందర్‌రావు (Government School Visit) సందర్శించారు. అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. ఈ స్కూల్లో దాదాపు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి మెరుగైన విద్యా వాతావరణం, సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి విద్యార్థి అభివృద్ధి, భవిష్యత్ కోసం చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే (Former Mla) గువ్వల బాలరాజు (Guvvala Bala Raju) తదితరులు పాల్గొన్నారు.
Ramachander Rao | పాఠశాల సందర్శించిన తెలంగాణ బీజేపీ చీఫ్
- Advertisement -
RELATED ARTICLES

