Friday, March 6, 2026
HomeతెలంగాణAI | ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుంది..

AI | ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుంది..

  • వేయికోట్ల రూపాయలతో స్టార్టప్లను ప్రోత్సహిస్తాం
  • క్వాంటం టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్
  • 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీకి ప్లాన్
  • నీతి ఆయోగ్ క్వాంటం సదస్సులో భట్టి, శ్రీధర్ బాబు

రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుందని డిప్యూటీ సీఎం విక్రమార్క పేర్కొన్నారు. అయితే, తెలంగాణ 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీకి చేరుకోవాలని ప్లాన్‌ చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌ లో నిర్వహించిన క్వాంటం పవర్డ్‌ ఎకానమీ స్ట్రాటజీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ గురించి దేశం చర్చిస్తుంది.. దాని ఆవిష్కరణకి తెలంగాణను ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్‌ కి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. డిజిటల్‌, టాలెంట్‌ కి హైదరాబాద్‌ కి కేంద్రంగా మారింది అన్నారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా టెక్నాలజీని ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నారు..

నీతి ఆయోగ్‌ కూడా గ్లోబల్‌ సమ్మిట్‌ లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.. ఈ తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ అన్ని రంగాల పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం.. యంగ్‌ ఇండియా స్టార్టప్‌ కోసం ఫండిరగ్‌ చేయాలని నిర్ణయించాం.. 1000 కోట్ల రూపాయలతో స్టార్టప్‌ లను ప్రోత్సహిస్తామని భట్టి విక్రమార్క వెల్లడిరచారు. ‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్‌ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్‌ లీడర్‌ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ’లాంగ్‌ టర్మ్‌ క్వాంటం స్ట్రాటజీని రూపొందించా మన్నారు.

- Advertisement -

గచ్చిబౌలిలోని ’ఐఐఐటీ హైదరాబాద్‌’లో ’నీతి ఆయోగ్‌ రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ క్వాంటం అండ్‌ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పట్లో విద్యుత్‌, ఇంటర్నెట్‌ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ లో తెలంగాణను గ్లోబల్‌ లీడర్‌ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ’లాంగ్‌ టర్మ్‌ క్వాంటం స్ట్రాటజీలో భాగంగా రీసెర్చ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌, సైబర్‌ సెక్యూరిటీ, లైఫ్‌ సైన్సెస్‌ యాక్సిలరేషన్‌, టాలెంట్‌ పైప్‌లైన్‌ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

కమ్యూని కేషన్‌, క్వాంటం కంప్యూటింగ్‌లో ఆర్‌అండ్‌ డీ, ఇన్నోవేషన్స్‌ ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్టాల్రకు ఒక రోల్‌ మోడల్‌ గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశర చేసే ’డైరెక్షన్‌’ అని అన్నారు. ఈ టెక్నాలజీ లో దేశానికి ఒక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసేలా ప్రత్యేకంగా ’సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌’కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్‌, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ను ప్రారంభిం చబోతున్నట్లు చెప్పారు. ఇండస్టీ డే పేరిట ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News