Wednesday, March 4, 2026
Homeక్రైమ్ వార్తలుACB | 2025లో 199 అవినీతి కేసులు

ACB | 2025లో 199 అవినీతి కేసులు

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ 2025వ సంవత్సరంలో మొత్తం 199 అవినీతి(Corruption) కేసులను నమోదు చేసింది. 273 మంది నిందితులను (Accused) అదుపులోకి తీసుకుంది. మొత్తం కేసుల్లో 157 కేసులను ట్రాప్ చేయగా 224 మంది నిందితులను అరెస్ట్(Arrest) చేశారు. ఇందులో 176 మంది ప్రభుత్వ అధికారులు(Government Officers) ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ అధికారులపై 15 కేసులు బుక్ అయ్యాయి. 26 కేసులు నేరపూరితమైన దుష్ప్రవర్తనకు సంబంధించినవి. ఇందులో 34 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ట్రాప్ చేసిన 158 కేసుల్లో రూ.57.17 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.35.89 లక్షలను ఫిర్యాదుదారులకు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News