Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిAnganwadi | టీచర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వినతి

Anganwadi | టీచర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వినతి

ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని నూతనకల్ గ్రామంలో అంగన్వాడి కేంద్రాలు,ఆశా వర్కర్ పోస్టుల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు మేడ్చల్ సోమవారం జిల్లా కలెక్టర్ ను కోరారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ నూతనకల్ గ్రామంలో మొత్తం రెండు అంగన్వాడి కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం అంగన్వాడిటీచర్లు లేకపోవడం వల్ల ఒక కేంద్రం పూర్తిగా మూసివేయబడిందని వారు తెలిపారు. మరో కేంద్రంలో ఇతర గ్రామానికి చెందిన ఇన్చార్జి ద్వారాతాత్కాలికంగా అంగన్వాడి నిర్వహిస్తున్నారని అన్నారు,అక్కడ కూడా హెల్పర్ లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాషా, సురేశ్ రెడ్డి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News